కువైట్‌ నాయకుల హత్యకు హెజ్‌బొల్లా కుట్ర

కువైట్‌ నాయకుల హత్యకు హెజ్‌బొల్లా కుట్ర

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ హెబ్‌బొల్లా భారీ కుట్రకు తెరలేపింది. కువైట్ నాయకుల హత్యకు పన్నాగం పన్నింది. నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. కువైట్ నాయకులతో పాటు మరిన్ని గల్ఫ్ దేశాధినేతల హత్యలకు కూడా ప్లానింగ్ చేసినట్లు గుర్తించారు. హత్యకు ప్లాన్ చేసిన గ్రూప్‌కు సంబంధం ఉన్న మరో 14 మంది కోసం గాలిస్తున్నారు.