VIDEO: ఫైలు వెతికి కనిపెట్టేందుకు ఒక SIT వేయాలి: KTR
HYD: ఆనాడు గవర్నర్ తొలి ప్రసంగంలో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామని చెప్పారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేసిన ఆరు గ్యారంటీల ఫైలు ఎటు పోయింది? FSL అగ్నిప్రమాదంలో కాలిపోయిందా? అని ప్రశ్నించారు. మాయమైన ఆరు గ్యారంటీల ఫైలు వెతికి కనిపెట్టేందుకు ఒక SIT వేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.