ఓటర్లను కలిసే పనిని ముమ్మరం చేసిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి
RR: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను కలిసే పనిని ముమ్మరం చేశారు. నందిగామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొమ్ము కృష్ణ ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిశారు. ప్రతి ఒక్క ఓటరును ఆప్యాయతతో పలకరిస్తూ తమ గెలుపుకు సహకరించాలని ఓటర్లను అభ్యర్థించారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు తమను గెలిపించాలంటూ ముందుకు సాగుతున్నారు.