'17 నుంచి మహిళలకు వైద్య శిబిరాలు'

SRD: స్వాస్త్ నారి- స్వశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మహిళలకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల సోమవారం ప్రకటన తెలిపారు. 15 రోజులపాటు ప్రతిరోజు 10 వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు