ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన MLA
NLG: నకిరేకల్ పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఇవాళ MLA వేముల వీరేశం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అమ్మవారి ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని MLA ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ రజితా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.