జూన్ 1 వరకు నిషేధాజ్ఞలు: RGM పోలీస్ కమిషనర్

PDL: సాధారణ పౌరులు, మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో జూన్ 1 వరకు నిషేధాజ్ఞలు విధించినట్లు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. బహిరంగంగా మద్యం తాగడం, DJ, డ్రోన్లు వినియోగించవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.