హనుమ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

హనుమ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

TPT: హనుమ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గూడూరు పట్టణం విజ్ఞేశ్వరపురంలో గల శ్రీ ఆంజనేయ స్వామిని గూడూరు ఎమ్మెల్యే పీ.సునీల్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకి సోదర స్వాగతం పలికి అర్చనలు నిర్వహించారు.