ఇండిగోపై కేంద్రం చర్యలు తీసుకోవాలి: చామల
ఇండిగోపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రయాణికుల భద్రత పట్ల ఇండిగో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. డీజీసీఏ రూల్స్ పాటించకుండా ఇండిగో సంస్థ.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. ఏపియేషన్ ఇండస్ట్రీలో ఇండిగో వాటా 60 శాతానికిపైగా ఉండడంతో విమాన ప్రయాణాలు చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు.