అంబులెన్స్‌లో మహిళ ప్రసవం
MDK: చేగుంట మండలం రుక్మాపూర్‌కు చెందిన గర్భిణీ స్రవంతికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. శంకరంపేట(ఆర్) అంబులెన్స్ సిబ్బంది ఆమెను గజ్వేల్ ఎంసీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో రుక్మాపూర్ శివారులో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో అంబులెన్స్ టెక్నీషియన్ మంజుల ప్రసవం చేయడంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.