జిల్లాలో దారుణ హత్య.. యువకుడు మృతి
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడులో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు దారుణంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.