భారీ పుట్టగొడుగు చూశారా..?

భారీ పుట్టగొడుగు చూశారా..?

KDP: వేంపల్లె మండలం రామిరెడ్డిపల్లెలో అరుదైన భారీ పుట్టగొడుగు వెలసింది. గ్రామానికి చెందిన రైతు బోరెడ్డి నరసింహారెడ్డి పొలంలో ఈ పుట్టగొడుగు మొలిచింది. 1.76 కిలోల బరువు తూగింది. ఇంత భారీ పుట్టగొడుగు అరుదుగా లభిస్తుందని రైతులు చెప్పారు. దీనిని చూసేందుకు పలువురు ఆసక్తి చూపారు.