డీఎడ్ 3వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

డీఎడ్ 3వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

NTR: ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న డీ. ఎడ్ 3వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. 10వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా డీ. ఎడ్ 3వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.