సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
NDL: ఈనెల 9న డోన్ మండలం కొత్త బురుజులో సీఎం పర్యటన జరగనుంది. ఈ కార్యక్రమంలో నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి స్వయంగా పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.