రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఫ్యాన్ పడి మహిళకు గాయం

రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఫ్యాన్ పడి మహిళకు గాయం

MBNR: పట్టణ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పరిస్థితులు దారుణంగా మారాయి. సోమవారం కార్యాలయానికి వచ్చిన ఓ మహిళపై సీలింగ్ ఫ్యాన్ ఊడి పడి గాయాలపాలైనట్లు స్థానికులు తెలిపారు. నిత్యం వందకు పైగా వినియోగదారులు గంటల తరబడి నిరీక్షిస్తున్నా, కుర్చీలు, మంచినీరు, టాయిలెట్ల సౌకర్యాలు కూడా లేవన్నారు. రిజిస్ట్రార్ స్పందించి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.