VIDEO: పెద్దూర్‌లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రమాదం

VIDEO: పెద్దూర్‌లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రమాదం

అన్నమయ్య: గాలివీడు మండలం పెద్దూర్ రోడ్డులో బాడుగ ఇంటిలో నివసిస్తున్న పెద్దపోల మునిరాజా ఇంట్లో రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు. అయితే ఇంట్లో ఉన్న నగలు, బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయన్నారు. బంగారం, ముఖ్యమైన పత్రాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.