బోనాల వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే సతీమణి

NGKL: అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన శ్రీ గెల్వలాంబ బోనాల వేడుకలకు ఎమ్మెల్యే వంశీకృష్ణ సతీమణి మాజీ జడ్పీటీసీ డాక్టర్ చిక్కుడు అనురాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి బోనమెత్తి వారిని ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.