గ్రీన్ గుంటూరు - క్లీన్ గుంటూరే లక్ష్యం

GNTR: గుంటూరును పరిశుభ్రంగా, పచ్చగా మార్చేందుకు కృషి చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. గురువారం ఇన్నర్ రింగ్ రోడ్డు, గాయత్రినగర్, బ్రాడీపేట వంటి ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రీన్ గుంటూరులో భాగంగా 5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.