'రేపు డయల్ యువర్ డీఎం'

W.G: ఆర్టీసీ ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం గురువారం ఉదయం 11 గంటలు నుంచి 12 వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం జరగనుంది. నరసాపురం ఆర్టీసీ డీఎం సుబ్బన్నరెడ్డి ఈ మేరకు బుధవారం ప్రకటనలో తెలిపారు. కార్గో సేవలు, బస్సులకు సంబంధించిన ఇబ్బందులపై సలహాలు, సూచనలు, ఫిర్యాదులుంటే 99592 25486 నంబర్ కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు