అలర్ట్.. జిల్లాకు పిడుగుపాటు హెచ్చరికలు..!
ఏలూరు జిల్లా వ్యాప్తంగా రానున్న 24 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల విస్తారంగా వర్షాలు కురస్తాయని తెలిపింది. ఈ క్రమంలో 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.