అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో ఉన్న నెహ్రూ పార్క్ (ముత్యాలమ్మ కోనేరు)లో సుమారు రూ.10 లక్షల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శిరీష శంకుస్థాపన చేశారు. అనంతరం కోనేరు గట్టుపై ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంలో పార్కులను అభివృద్ధి చేస్తామని తెలిపారు.