ధాన్యం కొనుగోలు సమస్యలకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కృష్ణా: ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ. 2,830 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి విజయవాడ కానూరులో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అనంతరం 1967 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను మంగళవారం ప్రారంభించారు.