'కమీషన్లు దండు కోవడానికే గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన'
WNP: గోపాలపేట మండలంలో రిజర్వాయర్ నిర్మాణం వల్ల రైతాంగం దాదాపు 10 వేల ఎకరాలు నష్టపోతుందని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు. అఖిలపక్ష వ్యతిరేక పోరాట సమితి 98 రోజు నుంచి చేపడుతున్న నిరసన దీక్షకు వారు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేయకుండా నష్టం కలిగించే పనుల్లో చేపడుతున్నారని విమర్శించారు.