'సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఒత్తిడి దూరం'

'సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఒత్తిడి దూరం'

NDL: సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులకు ఒత్తిడి దూరమవుతుందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. పట్టణంలోని SDR పాఠశాలలో శనివారం 11వ వార్షిక క్రీడోత్సవాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఒకే వేదికపై విభిన్న క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ కృష్ణమూర్తి, HC నాగరాజు పాల్గొన్నారు.