VIDEO: విద్యుత్ షాక్‌తో రైతు మృతి
ASR: డుంబ్రిగూడ మండలంలోని గుంటగనెల పంచాయితీ పిత్తగూడ గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిల్లో బలరాం (47) గ్రామ శివారులోని మిరియాల తోటకు వెళ్లి మిరియాలు సేకరిస్తుండగా నిచ్చెన విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురైన బలరాం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.