సర్పంచ్ అభ్యర్థిగా ట్రాన్స్ జెండర్ నామినేషన్ దాఖలు
MNCL: జైపూర్(M)లోని వెంకట్రావ్ పల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ కుమ్మరి వైశాలి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. జనరల్ మహిళకు రిజర్వేషన్ చేయడంతో వైశాలి ఈ నిర్ణయం తీసుకున్నారు. చెన్నూర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైశాలి, సర్పంచ్‌గా గెలిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.