అదుపు తప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లిన కారు

అదుపు తప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లిన కారు

NZB: ఓ కారు అదుపు తప్పి డ్రైనేజీలోకి దూసుకెళ్లిన ఘటన నగర శివారులోని మాధవ నగర్ వద్ద శనివారం చోటు చేసుకుంది. సాయిబాబా ఆలయం వద్ద ఆర్వోబీ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో రోడ్డు గుంతలమయంగా మారింది. ఈక్రమంలలో ఉదయం ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయింది. ఎయిర్​ బ్యాగ్స్​ ఓపెన్​ కావడంతో కారులోని వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు.