రూ.4కోట్ల 82 లక్షలతో నూతన రోడ్డు నిర్మాణం

కృష్ణా: ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కోడూరు మండలం మాచవరం నుంచి దక్షిణ చిరువోలులంక మీదుగా అవనిగడ్డ - కోడూరు ప్రధాన రహదారి వరకు బీటీ రోడ్ నిర్మాణం పూర్తి చేశారు. ఈ పథకం కింద మంజూరైన రూ.4కోట్ల 82 లక్షల నిధులతో ఈ రోడ్డును నిర్మించారు. ఇంకా మోదుమూడి - మాచవరం వరకూ కిలోమీటర్ రోడ్డు వేయాల్సి ఉంది. ఈ నిర్మాణ పనులను పంచాయతీరాజ్ ప్రాజెక్టు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.