VIDEO: కంభంలో ఉరి వేసుకుని వ్యక్తి మృతి

VIDEO: కంభంలో ఉరి వేసుకుని వ్యక్తి మృతి

ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక అర్బన్ కాలనీలో బుధవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. కాలనీలో నివాసముంటున్న సయ్యద్ సద్దాం (32) అనే వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.