బహిరంగ సభ గోడ పత్రికల విడుదల

NGKL: ఈనెల 24న వరంగల్‌లోని అంబేద్కర్ భవన్‌లో జరగనున్న ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక బహిరంగ సభ గోడ పత్రికలను ఇవాళ అచ్చంపేటలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర నాయకుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కార్పొరేట్ కంపెనీల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులను వేటాడుతున్నాయని ఆరోపించారు.