VIDEO: విద్యుత్ స్తంభంపై పిచ్చి మొక్కలు
MBNR: మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. విద్యుత్ స్తంభాలకు పిచ్చి మొక్కల తీగలు అల్లుకుని ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు ఇబ్బందిగా మారడమే కాక, తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఈ మొక్కలను తొలగించాలని కోరుతున్నారు.