గిట్టుబాటు ధర లేక.. రైతు మృతి

గిట్టుబాటు ధర లేక.. రైతు మృతి

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం, కోయవారిపాలెం గ్రామానికి చెందిన ముప్పాళ్ళ నాగార్జున చౌదరి, 8 ఎకరాల్లో పొగాకు పంట వేశాడు. గిట్టుబాటు ధర లభించక, అప్పుల భారంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.