జడ్పీ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
ELR: నూజివీడు మండలం మద్దాయి కుంట జడ్పీ హైస్కూల్ లో శుక్రవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం దారపురెడ్డి భాస్కరరావు మాట్లాడుతూ.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా నిర్వహిస్తారన్నారు. ఉపాధ్యాయులు శ్రీను చిన్నారులకు పెన్నులు, పెన్సిళ్లు, చాక్లెట్లు అందించారు.