గోషాడలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

గోషాడలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

VZM: కూటమి ప్రభుత్వం ప్రతిష్టత్మంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులు‌ను గురువారం గుర్ల మండలం గోషాడ గ్రామంలో జనసేన మండల అధ్యక్షుడు యడ్ల సంతోష్ మరియు వీఆర్వో వెంకటరమణ పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి కార్డుదారులకు స్మార్ట్ రైస్ కార్డ్‌లు అందజేశారు. అర్హులు అందరికీ రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని అన్నారు.