పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ELR: మండవల్లి మండలం తక్కెళ్ళపాడు గ్రామంలో ఆదివారం కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పర్యటించారు. నరేగా నిధులుతో నిర్మించిన సీసీ రోడ్లు, నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.