VIDEO: పేలిన ఛార్జింగ్ పెట్టిన ఫోన్

KMM: ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పేలిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. సత్తుపల్లి మామిళ్లపల్లి కాంప్లెక్స్ సమీపంలోని ఓ ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన వివో ఫోన్ ఉన్నట్లుండి పేలింది. దీంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. సుమారు రూ. 10లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు పేర్కొన్నాడు.