పాక్‌కు నిధులు ఇవ్వొద్దు: భారత్

పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు నిధులు ఇవ్వొద్దని ఏడీబీని భారత్ కోరింది. ఈ మేరకు ఏడీబీ అధ్యక్షుడు మసాటో కందాతో పాటు, ఇటాలియన్ ఆర్థిక మంత్రి జియాన్ కార్లో గియోర్గెట్టిని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. అయితే ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్.. IMFతో పాటు ఏడీబీ నుంచి అందుతున్న నిధులపై ఆధారపడుతోంది.