'అధికారులు PGRS కార్యక్రమానికి హాజరు కావాలి'

GNTR: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి వట్టిచెరుకూరు మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని తహసీల్దార్ క్షమారాణి స్పష్టం చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకాని అధికారులపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె ఆదివారం హెచ్చరించారు.