ఆరుగురిపై కేసులు నమోదు

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల అనంతసాగరం, పడమటి ఖమ్మంపాడు గ్రామాల్లో సోమవారం విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఏడీ పరిశుద్ధరావు, ఏఈలు సుధీర్, కోటయ్య తమ సిబ్బందితో కలిసి విస్తృత దాడులు నిర్వహించారు. అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వారిపై 6 కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు.