కేంద్ర సాయుధ దళాల్లో ఎంపికైన 8మంది NCC విద్యార్థులు

కేంద్ర సాయుధ దళాల్లో ఎంపికైన 8మంది NCC విద్యార్థులు

VZM: సత్య డిగ్రీ కాలేజీకి చెందిన 8 మంది NCC విద్యార్థులు కేంద్ర సాయుధ దళాలైన CISF, CRPF, BSF ల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ డా. బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ.. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు , కఠిన శ్రమతో జాతీయ స్థాయిలో ఉద్యోగాలు సాధించడం ఎంతో గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో డా. ఎం. శశిభూషణ్ రావు పాల్గొన్నారు.