శైవ క్షేత్రాలలో బారులు తీరిన భక్తులు
CTR: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా పుంగనూరులోని శైవ క్షేత్రాలలో వేకువ జాము నుంచి భక్తుల రద్దీ నెలకొంది. పరమేశ్వరుని దర్శించి దీపాలు వెలిగించి తమ మొక్కలను చెల్లించుకున్నారు. పట్టణంలోని కోనేటి వద్ద వెలిసిన పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, పాత బస్టాండ్ సమీపాన శ్రీ భోగనంజుండేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు బారులు తీరారు.