షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

NRML: ముధోల్ మజీద్ చౌక్ సమీపంలోని గడ్డమొల్ల రమేష్ ఇంట్లో గురువారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది. కిరాణా సామాగ్రి, నగదు, బంగారం కలిపి సుమారు రూ.6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై బిట్ల పెర్సిస్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.