ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

కృష్ణా: గూడూరు మండలం టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి ఎమ్మేల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులకు చరవాణి నుండి ఆదేశించి, సమస్యను వెంటనే పరిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామన్నారు.