అనంతబాబు భార్య పిటిషన్‌పై ముగిసిన వాదనలు

అనంతబాబు భార్య పిటిషన్‌పై ముగిసిన వాదనలు

AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన మాజీ MLC అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ దాఖలు చేసిన పిటిషన్‌పై రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి. తనపై ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేయాలని ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి ఇవాళ సా.4:30 గంటలకు తీర్పు వెల్లడించనున్నారు. విచారణకు హాజరయ్యేందుకు లక్ష్మీదుర్గ కోర్టుకు వెళ్లారు.