మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
BHNG: ఆలేరు పట్టణంలోని ఏలుగల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న చాముండేశ్వరి యూత్ సభ్యులు అందరూ కలిసి ఆదివారం మృతుడి కుటుంబానికి రూ.20,000/- ఆర్థిక సహాయం అందజేశారు. మృతుడు శ్రీనివాస్ పట్టణంలో వెల్డింగ్ వర్క్ చేసుకుంటు జీవనం సాగిస్తుండేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.