కుమారుడిని హత్య చేసిన తండ్రి అరెస్ట్

KRNL: జిల్లా దేవనకొండలో 8 నెలల బాబు సాగర్ను నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసిన తండ్రి నరేష్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యతో తరచూ గొడవ పడుతున్న నరేష్, ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడిని పత్తికొండ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి కేసు నమోదు చేశారు.