పరస్పరం దాడి.. ఇరువర్గాల పై కేసు నమోదు

MNCL: బెల్లంపల్లి రైల్వే రడగంబాల బస్తీలో పరస్పరం దాడి చేసుకున్న ఘటనలో ఇరువర్గాల పై కేసు నమోదు చేసినట్లు 2టౌన్ ఎస్సై మహేందర్ శనివారం ప్రకటనలో తెలిపారు. గుడుంబా అమ్ముతున్నరనే సమాచారం మేరకు ఎక్సైజ్ సిబ్బంది రెయిడ్‌కు వెళ్లగా లవుడియా దీపక్, మోహన్ కానిస్టేబుల్ సురేష్‌తో గొడవపడి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశామన్నారు.