'జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి'
VKB: దేశానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ సుధాకర్ పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని దన్నారం కాలనీలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.