VIDEO: చెట్లకు నిప్పు.. మంటలార్పుతున్న సిబ్బంది
PLD: చిలకలూరిపేట ఎన్టీఆర్ నగర్ టిడ్కో గృహ సముదాయంలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు చెట్లకు నిప్పు పెట్టారు. మంటలు ఎగిసి పడుతుండడంతో అక్కడ ఉంటున్న ప్లాంట్ నిర్వాహకులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని ఏఎస్సై హుస్సేన్, సిబ్బంది కలిసి మంటలను అదుపు చేశారు. 3 వేల కుటుంబాలు ఉంటున్నారని, ప్రమాదం తప్పిందని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు.