ఆంజనేయుడిని దర్శించుకున్న మాజీ మంత్రి
PLD: చిలకలూరిపేట మండలంలోని బొప్పూడిలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి 43వ వార్షికోత్సవ తిరునాళ్లలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న ప్రత్తిపాటి, ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు. స్వామివారు చాలా మహిమగలవాడని, ఆంజనేయుడిని నమ్ముకున్నవారికి ఎలాంటి బాధలు ఉండవని ఆయన చెప్పుకొచ్చారు.