సర్పంచ్‌గా ఎమ్మెల్యే తండ్రి ఘన విజయం
సూర్యాపేట జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించారు. 95 ఏళ్ల వయసులో ఆయన నాగారం సర్పంచ్ ఎన్నికలలో పోటీచేసి గెలుపొందడం విశేషం. దీంతో రాష్ట్ర చరిత్రలో అత్యధిక వయస్కుడిగా ఆయన రికార్డ్ సృష్టించారు. ఈ అరుదైన విజయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.